ధోనీ కంటే కోహ్లీతోనే టీమిండియాకు ఉజ్వల భవిష్యత్తు

July 06, 2015 | 02:47 PM | 3 Views
ప్రింట్ కామెంట్
viv_richards_kohli_captaincy_dhoni_niharonline

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించాడు. జట్టు వన్డే, టీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోలిస్తే విభిన్నంగా ఉండే కోహ్లీ సారథ్యంలో టీమిండియాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని వివ్ వ్యాఖ్యానించాడు. జట్టు వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోలిస్తే విభిన్నంగా ఉండే కోహ్లీ సారథ్యంలో భారత జట్టు అత్యున్నత శిఖరాలకు చేరనుందని కూడా రిచర్డ్స్ అన్నాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరించే కోహ్లీ, మ్యాచ్ నాణ్యతను పెంచేస్తాడని పేర్కొన్నాడు. దూకుడుగా ఉంటూనే కోహ్లీ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడని కితాబిచ్చాడు కోహ్లీ బ్యాటింగ్ శైలి కూడా అద్భుతమని వివ్ ప్రశంసించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ