ఫస్ట్ డే : ధాటిగా ఆడుతున్న భారత్... 319/6

August 20, 2015 | 05:52 PM | 1 Views
ప్రింట్ కామెంట్
lokesh_rahul_century_against_srilanka_second_test_niharonline

రెండో టెస్ట్ లోని మొదటి రోజు ఆట భారత్ ధాటిగా ఆడింది. మురళి విజయ్ రహానే లు తక్కువ స్కోర్ కే అవుటయ్యారు. ఓ దశలో 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.  అయితే  మిగతా వాళ్లు నిలకడగా రాణించడంతో స్కోర్ బోర్డు  300 దాటింది. ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. మరో ఓపెనర్ రాహుల్ అద్భుతంగా ఆడి కెరీర్ లో తన రెండో సెంచరీ నమోదు చేయటం విశేషం. 180 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 108 పరుగులు చేసి చమీర బౌలింగ్ లో అవుటయ్యాడు. ఇక కెప్టెన్ కోహ్లీ 78 పరుగులు చేసి అవుటవ్వగా, స్టువర్ట్ బిన్నీ 10 పరుగులకే వెనుదిరిగాడు. ఇక మొదటి టెస్ట్ లో విఫలమైన రోహిత్ శర్మ కూడా అర్థ శతకంతో కదం తొక్కాడు. ఆట చివర్లో మాథ్యూస్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం వృద్ధిమాన్ సాహా 19 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. శ్రీలంక బౌలర్లలో దమ్మిక ప్రసాద్ కు రెండు వికెట్లు లభించాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ