క్లీన్ స్వీప్ కోసం టీమిండియా తహతహ

October 08, 2015 | 11:53 AM | 2 Views
ప్రింట్ కామెంట్
india-south-africa-eden-gardens-t20-niharonline

షాక్ అవ్వకండి. రెండు మ్యాచ్ లు కోల్పోయాక ఇంకా టీమిండియా క్లీన్ స్వీప్ కోసం తహ తహ ఏంటునుకుంటున్నారా. అవును, పరిస్థితి చూస్తే అలాగే ఉంది. సొంత గడ్డపై అందివచ్చిన అవకాశాన్ని ధోనీసేన అందిపుచ్చుకోలేకపోయింది. తొలి మ్యాచ్ ను చేజేతులా వదిలివేయగా, రెండో మ్యాచ్ లో సఫారీల వీరవిహరం ముందు తలవంచక తప్పలేదు. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సఫారీలు టీ20 కప్ ను గెలిచేశారు. పరువుగా ఫీలయిన ఫ్రీడమ్ సిరీస్ ను పరమ చెత్తగా ఓడిపోయారు. ఇంకా ఏం మిగిలి ఉంది. అందుకే క్లీన్ స్వీప్ చేసుకుని త్వరగా తర్వాతి మ్యాచ్ లకు సిద్ధమైపోవచ్చని టీమిండియా భావిస్తుందేమో.

చివరి టీ20 మ్యాచ్ ఈ రోజు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. కనీసం ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా కనీసం పరువునైనా కాపాడుకునేందుకు టీమిండియా యత్నిస్తోంది. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్ ల విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న సఫారీ జట్టు ఈ మ్యాచ్ లోనూ నెగ్గి క్లీన్ స్వీప్ సాధించాలని పథకం రచిస్తోంది. మరి టీమిండియా పరువు నిలుస్తుందో, సఫారీ ప్లాన్ సక్సెస్ అవుతుందో చూడాలి. అవకాశాలు వారికే ఎక్కువగా ఉన్నాయ్ మరి. ఏం చేస్తాం.. పోయింది ఎలాగూ పోయింది కనీసం వన్డేలకైనా సరిగ్గా సిద్ధమైతే అంతే చాలు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ