మూడుతోనే ముగుస్తుందా?

November 27, 2015 | 12:18 PM | 2 Views
ప్రింట్ కామెంట్
nagpur-third-test-india-day-3-south-africa-niharonline

భారత్, దక్షిణాఫ్రికాల మధ్య నాగ్ పూర్ లో జరుగుతున్న మూడో టెస్టు ముచ్చటగా మూడో రోజే ముగిసిపోతుందా అనిపిస్తోంది. ఇప్పటికే రెండు ఇన్నింగ్స్ లు ఆడేసిన టీమిండియా 278 పరుగుల ఆధిక్యంలో ఉంది. వికెట్ల పతనం కొనసాగుతున్న ఈ మ్యాచ్ లో ఈ స్కోరున్న జట్టు సురక్షిత స్థితిలో ఉన్నట్లే.

మరోవైపు 79 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో చతికిలబడ్డ సఫారీలు, రెండో ఇన్నింగ్స్ లో 32 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. నేటి ఆటను ప్రారంభించిన ఆ జట్టు మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఇంకా 201 పరుగులు సాధించాల్సి ఉంది. అయితే స్పిన్ మాయాజాలంతో క్షణాల్లో మ్యాచ్ ను ముగిస్తున్న టీమిండియా బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల బౌలింగ్ ను ఎదుర్కొని ఆ మేర స్కోరు సాధించడం దుర్లభంగానే కనిపిస్తోంది.

వెరసి విజయం కోసం వారికి రెండొందల పరుగులు అవసరం కాగా, మనకు మాత్రం 6 వికెట్లు పడితే సరిపోతుంది. ఏం జరుగుతుందో మరో రెండు, మూడు గంటల్లోనే తేలిపోనుంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డేంజరస్ డెవిలియర్స్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ కాగా, తహీర్(8) మిశ్రా బౌలింగ్ లో సేమ్ అదే పద్ధతిలో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఆమ్లా 28, ప్లెసిస్ 23 పరుగులతో ఆడుతుండగా, దక్షిణాఫ్రికా స్కోరు 46 ఓవర్లలో 109/4.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ