రహానే సక్సెస్ సీక్రెట్ అదా?

September 12, 2015 | 04:34 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Ajinkya-Rahane-success-secret-niharonline

ప్రస్తుతం టీమిండియాలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌లో అజింక్యా రహానె ఒకడు. రాహుల్‌ ద్రావిడ్‌ స్కూల్‌ నుంచి వచ్చిన రహానె కూడా అతడిలాగే జట్టు కోసం ఎలాంటి త్యాగానికైనా వెనుకాడని తత్వాన్ని వంటబట్టించుకున్నాడు. అందుకే ఐదో స్థానంలో అద్భుతంగా రాణిస్తున్న వాడిని వన్‌డౌన్‌లో పంపినా జట్టు కోసమే కదా.. అని అంగీకరించాడు. మూడులోనూ అదరగొట్టి.. ఏ స్థానానికైనా రెడీ అని చాటిచెప్పాడు. జింబాబ్వే పర్యటనలో కెప్టెన్సీ భారాన్ని కట్టబెడితే అక్కడా నెగ్గుకొచ్చాడు..! జట్టు ప్రయోజనాల ముందు తన ఆనందం తృణప్రాయమని చెబుతున్న రహానె.. త్వరలో జరిగే సఫారీల సిరీస్‌ కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు.

రెండేళ్ల టెస్టు కెరీర్‌లో రహానె మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ బ్యాట్స్‌మన్‌గా నిరూపించుకున్నాడు. అలాంటి వ్యక్తి విజయ రహస్యమేమిటో తెల్సా? డైరీ అట. తానాడిన ఇన్నింగ్స్‌ను ఎప్పడికప్పుడు సమీక్షించుకోవడమేనని రహానె చెబుతున్నాడు. ప్రతి ఇన్నింగ్స్‌ గురించి డైరీలో రాసుకుంటానని.. ఆ తర్వాత వాటిలోని లోపాలను సరిదిద్దుకుంటానని పేర్కొన్నాడు. జీవితంలో ఎన్నో విషయాలు జరిగిపోతుంటాయి. వాటన్నింటినీ గుర్తుంచుకోవడం కష్టం. కానీ.. ఫలానా ఇన్నింగ్స్‌ ఆడినపుడు ఉన్న పరిస్థితులేమిటి..? మన ఆలోచనా విధానం ఎలా ఉంది? ఆ సమయంలో ఎలాంటి అను భూతికి లోనయ్యాం..? ఇలాంటివన్నీ రాసి పెట్టుకుంటే ప్రతి ఇన్నింగ్స్‌కు మధ్య తేడా మనకు తెలిసిపోతుంది. అందుకే సెంచరీ సాధించినా లేక సున్నాకే అవుటైనా అవన్నీ డైరీలో రాసిపెట్టుకుంటాను. క్రికెటర్‌గా కెరీర్‌ మొదలైనప్పటి నుంచీ నాకీ అలవాటు ఉంది. ఒకవేళ మంచి ఇన్నింగ్స్‌ల గురించి మాత్రమే రాసుకుంటే మన తప్పులు తెలిసే అవకాశం ఉండదు అని చెప్పుకొచ్చాడు.

 మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం మెడిటేషన్‌ కూడా చేస్తాను. నిద్రకు ఉపక్రమించే ముందు ఈ రోజు ఎలా గడిచిందనే దాని గురించి ప్రశ్నించుకుంటా. సరైన సమాధానం దొరికిన తర్వాత క్రికెట్‌తోపాటు దేని గురించీ ఆలోచించను. క్రీడాకారుల జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదువుతాను. ప్రస్తుతం ఆండ్రీ అగస్సీ (టెన్నిస్‌) జీవిత చరిత్ర ‘ఓపెన్‌’ చదువుతున్నాను. ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలనేది మేనేజ్‌మెంట్‌, కెప్టెన్‌ నిర్ణయం. జట్టు అవసరాల మేరకు ఏ స్థానంలోనైనా దిగుతా. అప్పుడే ఎలాంటి పరిస్థితిలోనైనా నెట్టుకురాగలిగే వీలుంటుందన్నాడీ సక్సెపుల్ బ్యాట్స్ మెన్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ