లంక సిరీస్ కు ముందు విఫలమైన కోహ్లీ

July 30, 2015 | 02:35 PM | 1 Views
ప్రింట్ కామెంట్
kohli_poor_performance_australia_A_niharonline

శ్రీలంక సిరీస్ కు ముందు కెప్టెన్ కోహ్లీ ప్రదర్శన కాస్త ఆందోన కలిగిస్తోంది. ఆస్ర్టేలియా ఏ తో అనధికారిక రెండో టెస్ట్ లో యువ భారత్‌ బ్యాటింగ్‌లో తడబడింది. ఆసీస్‌ స్పిన్‌, పేస్‌ దెబ్బకు పటిష్ఠ బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన పుజారా సేన కుదేలైంది. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ (16) పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 69 ఓవర్లకు 135 పరుగులు అలౌటయ్యింది. కరుణ్‌ నాయర్‌ (50) టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. కోహ్లీతో పాటు పుజారా (11), ముకుంద్‌ (15), శ్రేయాస్‌ అయ్యర్‌ (1) విఫలమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ర్టేలియా-ఎ తొలి రోజైన బుధవారం ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 43/0 స్కోరు చేసింది. బాన్‌క్రాఫ్ట్‌ (24 బ్యాటింగ్‌), ఖవాజా (13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత్‌ స్కోరుకు ఆసీస్‌ 92 పరుగులు వెనకబడి ఉంది. లోయర్ ఆర్డర్ మొత్తం 12 ఓవర్లకు 26 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలడం దారుణం. అయితే లంక పర్యటనకు ముందు కోహ్లీ ప్రదర్శన ఇలా పేలవంగా సాగటం కాస్త ఆందోళన కలిగించేదే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ