లంక లక్ష్యం 386... గెలుపు దిశగా భారత్

August 31, 2015 | 04:43 PM | 1 Views
ప్రింట్ కామెంట్
india-fix-huge-target-to-lanka-in-third-test-niharonline.jpg

తాడే పేడో తేల్చాల్సిన టెస్ట్ లో భారత్ పట్టుబిగించింది. నాలుగో రోజు ఆటలో 274 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయినా మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో 386 పరుగులు భారీ ఆధిక్యాన్ని లంక ముందు ఉంచింది. 21/3 ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్ ముందు బ్యాట్స్ మెన్ విఫలమైన తర్వాత రోహిత్ శర్మ (50), అశ్విన్ (58) రాణించడంతోపాటు బిన్నీ 49,  స్పిన్నర్ మిశ్రా 39, నమన్ ఓజా 35 పరుగులతో ఆదుకోవటంతో 274 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దమ్మిక ప్రసాద్, నువాన్ ప్రదీప్ చెరో 4 వికెట్లు తీశారు.

ఇక 386 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. కేవలం మూడు పరుగులకే కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు పెవిలియన్ చేరారు. భారత్ విజయానికి మరో 8 వికెట్లు అవసరం. ఆట మరో రోజు ఉంది. భారత్ విజయానికి అడ్డుపడాలంటే లంక తరపు నుంచి ఎదైనా అద్భుతం జరిగాల్సిందే.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ