జైలు ఊచలతో ట్రోఫీ తయారీకి బీసీసీఐ తహతహ

October 30, 2015 | 11:55 AM | 3 Views
ప్రింట్ కామెంట్
Gandhi-Mandela-freedom-series-trophy-jail-rods-niharonline

ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికాతో త్వరలో టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది టీమిండియా. అయితే "ఫ్రీడం సిరీస్" టెస్ట్ మ్యాచ్ ల అనంతరం విజేతలకు ఇచ్చే ట్రోఫీ వినూత్నంగా ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ, దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాలను గౌరవించే విధంగా ట్రోఫీని తయారు చేయాలని వినూత్న ఆలోచన చేసింది. వీరిద్దరి గుర్తుగా ట్రోఫీ సాగుతున్న నేపథ్యంలో ట్రోఫీ తయారీ కోసం గతంలో వారు మగ్గిన జైలు గదుల ఊచలు కావాలని అడుగుతోంది.

స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మాగాంధీని పూణెలోని ఎరవాడ జైలు గది లో బంధిగా ఉంచారు. ఇక జాతి వివక్షత పై పోరాడి మండేలా ఏళ్లపాటు రాబిన్ ఐలాండ్ జైలులో గడిపారు. ఆ మహానీయులు గడిపిన జైలు ఊచలను పీకి ఇవ్వాలని బీసీసీఐ ఇప్పటికే ఆయా జైలు అధికారులకు లేఖలు రాసింది. ఈ మేరకు శశాంక్ మనోహర్ పుణెలోని జైళ్ల డీజీకి స్వయంగా లేఖ రాశారు. కాగా, ఈ లేఖపై ఇప్పటికింకా నిర్ణయం తీసుకోనప్పటికీ, టెస్టు మ్యాచ్ ట్రోఫీ గాంధీ, మండేలా నివసించిన జైలు గదుల ఊచలతోనే తయారవుతుందని టాక్. ఇప్పటిదాకా జరిగిన టీ20, వన్డే మ్యాచ్ లకు వారిద్దరి బొమ్మలు చెరోవైపు ఉన్న బంగారు నాణేలను టాస్ కి ఉపయోగించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ