అఫ్ఘనిస్థాన్ కోచ్ గా పాక్ దిగ్గజం

November 04, 2015 | 01:00 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Inzamam-ul-Haq-to-be-Afghanistan-coach-niharonline

తమ దేశానికి చెందిన స్టార్లను రిటైర్ట్ అయిన తర్వాత కూడా వాడుకోవటంలో భారత్ తర్వాత మరో దేశం బహుశా లేదేమో. క్రికెట్ కు గుడ్ బై చెప్పాక దాదాపు స్టార్ బ్యాట్స్ మెన్లు అంతా ఇతర దేశాలకు కోచ్ గా వెళ్లటం ఈ మధ్య అలవాటైపోయింది. శ్రీలంక స్టార్ బ్యాట్స్ మెన్ జయవర్థనే ఇంగ్లాండ్ కోచ్ గా వెళ్లగా, ఇప్పుడు మరో క్రికెట్ దిగ్గజం ఇతర దేశ కోచ్ గా వెళ్తున్నాడు.

పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్ మెన్, మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ కోచ్ గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్ గా రెండేళ్ల ఒప్పందం పై ఆయన సంతకం చేశాడు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ మాజీ కోచ్, పాకిస్థాన్ ప్రస్తుత సెలెక్టర్ కబీర్ ఖాన్ మీడియాకు వెల్లడించాడు. ప్రపంచం గర్వించదగ్గ క్రికెటర్లలో ఇంజమామ్ ఒకడు... అతని కోచింగ్ లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ప్రమాణాలు మరింత మెరుగవుతాయనే ఆశిస్తున్నాం అని కబీర్ తెలిపాడు. నిజానికి రెండేళ్ల క్రితమే పాకిస్థాన్ క్రికెట్ కోచ్ గా ఇంజమామ్ కు అవకాశం వచ్చింది. అయితే, బోర్డుతో ఉన్న ఆర్థిక వివాదాల కారణంగా ఇంజీ అవకాశాన్ని వదులుకున్నాడు. ఇంజమామ్ 120 టెస్టులు, 388 వన్డేలు ఆడాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ