రెండో దాంట్లోనూ ముంచేశారు

October 06, 2015 | 10:40 AM | 3 Views
ప్రింట్ కామెంట్
South Africa-india-Cuttack-T20-niharonline

అదే ఓవర్ కాన్ఫిడెన్స్ భారత్ ని ఘోరంగా దెబ్బకొట్టింది. మొన్న ధర్మశాలలో ఎదురైన ఓటమి కన్నా దారుణమైన దానిని చవిచూసింది. ఫలితం ఫ్రీడమ్ సిరీస్ టీ20 టైటిల్ ను టీమిండియా చేజార్చుకుంది. కోహ్లీ, రోహిత్, ధోనీ ఇలా వరుసబెట్టి స్టార్ బ్యాట్స్ మెన్లు క్యూ కట్టేశారు. ఇక మ్యాచ్ ను చూసే ప్రేక్షకులకు కూడా టీమిండియా పట్ల విపరీతమైన ఆగ్రహాం పెల్లుబికింది. బాటిళ్లను మైదానంలోకి వారి నిరసన తెలియజేశారు. దీంతో కాసేపు మ్యాచ్ కి అంతరాయం కలగడంతోపాటు ఉద్రిక్తత నెలకొంది.

టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ డూప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకుని టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఆదిలోనే బ్యాటింగ్ లో తడబడ్డ టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. సఫారీ బౌలర్లు అల్బీ మోర్కెల్, మోరిస్, ఇమ్రాన్ తాహిర్ ల బౌలింగ్ కు టీమిండియా బ్యాట్స్ మెన్ బెంబేలెత్తిపోయారు. కేవలం 17.2 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌటయ్యారు.

ఇక ఆ తర్వాత 93 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసి విజయం సాధించింది. రెండో మ్యాచ్ లోనూ సఫారీ ఆల్ రౌండర్ జేపీ డుమిని (30 నాటౌట్) సత్తా చాటాడు. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో రెండింటిలో విజయం సాధించిన సఫారీలు టీ20 టైటిల్ ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్నారు. ఇక నామమాత్రపు మూడో మ్యాచ్ గెలిచినా ఓడినా పెద్ద తేడా లేదు. పరువు దక్కించుకోవటం తప్ప.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ