వన్డే మ్యాచ్ లో అర్థ శతకం ఈజీయే... శతకం కాస్త కష్టం. డబుల్ సెంచరీ చాలా కష్టం. మరీ ట్రిపుల్ సెంచరీ. అసలదీ సాధ్యం అయ్యేపనే కాదంటారా... లేదండీ. మాములుగా వన్డేలో డబుల్ సెంచరీ బాదడమే గొప్ప. అలాంటిది వన్డేలో ట్రిపుల్ సెంచరీ సాధ్యమయ్యింది. అది సాధించింది కూడా ఓ మహిళా క్రికెటర్. అయితే ఇది ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ లోనో కాదు. ఆంధ్ర క్రికెట్ సంఘం నార్త్ జోన్ విశాఖపట్నం, శ్రీకాకుళం మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఫీట్ నమోదయ్యింది. వైజాగ్ అమ్మాయి స్నేహ దీప్తి 166 బంతుల్లో 58 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అలవోకగా 350 పరుగులు చేసింది. దీప్తి విధ్వంసంతో వైజాగ్ మొత్తం 50 ఓవర్లకుగానూ కేవలం 4 వికెట్లు కోల్పోయి 608 పరుగులు చేసింది. ఇక బ్యాటింగ్ కి దిగిన శ్రీకాకుళం కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. దీంతో వైజాగ్ భారీ విజయం సొంతం చేసుకుంది. దీప్తి మరోవైపు బౌలింగ్ లో రాణించడం విశేషం. మూడు ఓవర్లు వేసి రెండు మెయిడెన్లు చేసి 2 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టింది అదరగొట్టింది. ఇంటర్ నేషనల్ కాకపోయినా ఇంటర్ డిస్ట్రిక్ మ్యాచ్ అయినప్పటికీ ఒక మహిళ ఈ రేంజ్ లో విజృంభించడంతో క్రీడాలోకంలో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్యూచర్ లో దీప్తి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆల్ ది బెస్ట్...