కదం తొక్కిన చెన్నై... ఫైనల్ చేరిక

May 23, 2015 | 11:04 AM | 28 Views
ప్రింట్ కామెంట్
hussey_fifty_csk_rcb_ipl_2015_second_qualifier_niharonline

చెన్నై ఛాన్స్ మిస్ చేసుకోలేదు. అందివచ్చిన అవకాశాన్ని దొరకబుచ్చుకుంది. తాజా సీజన్లో ఫైనల్ బెర్త్ కోసం జరిగిన పోరులో బెంగళూరును మూడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. శుక్రవారం రాత్రి రాంచీ లో జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 139 స్వల్ఫ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో ఆశిశ్ నెహ్రా కట్టుదిట్టంగా బ్యాటింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక బెంగళూర్ బ్యాట్స్ మెన్లలో గేల్ (41), మరో బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ ఖాన్(31) మినహా ఎవరూ రాణించలేదు. డివిలియర్స్, కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన చెన్నై బ్యాటింగ్ లో కూడా పోరాట పటిమను కనబరచింది. ఓపెనర్ హస్సీ 56 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ధోనీ (26), డు ప్లెసిస్ (21) విలువైన పరుగులు చేశారు. అయితే చివర్లో వరుసగా బ్యాట్స్ మెన్ అంతా క్యూ కట్టడంతో కాస్త టెన్షన్ నెలకొంది. అయితే, అశ్విన్ సింగిల్ తో మరో బంతి మిగిలి ఉండగానే చెన్నై విజయం సొంతం చేసుకుంది. ఇక టైటిల్ పోరు కోసం ఆదివారం ఈడెన్ గార్డెన్స్ లో ముంబై ఇండియన్స్ తో చెన్నై తలపడనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ