బెంగళూరుతో గర్జించి తీరాలన్న కింగ్స్ కోచ్

May 22, 2015 | 12:30 PM | 28 Views
ప్రింట్ కామెంట్
stephen_fleming_ms_dhoni_csk_niharonline

ముంబైతో పోరులో ఓడినప్పటికీ చెన్నైకి ఫైనల్ బెర్త్ కోసం మరో అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఇందులో ఎవరు గెలిస్తే వారు ఆదివారం ముంబైతో ఫైనల్ పోరులో తలపడతారు. దీంతో బెంగళూరుతో జరిగే మ్యాచ్ పై చెన్నై కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆటగాళ్లకు సలహాలు ఇస్తున్నాడు. టాప్ ఆర్డర్ గర్జించకుంటే ఇక అంతే సంగతులని చెబుతున్నాడు. జట్టు సభ్యులంతా సమిష్టిగా రాణించాలని, ఇప్పటిదాకా అలాంటి దాఖలాలు కనిపించలేదని ఓకింత అసహనంగా చెప్పాడు. టాప్ ఫైవ్ ఆటగాళ్లు రాణిస్తేనే మ్యాచ్ చేతుల్లో ఉంటుందని, ఇప్పటిదాకా ఓపెనర్ మెక్ కల్లమ్ మినహా ఎవరూ రాణించలేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నాడు. కనీసం నేటి మ్యాచ్ లోనైనా ఆ పరిస్థితి మారాలని చెబుతున్నాడు.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ