కోల్ ఖాతాలో మరో విజయం

May 08, 2015 | 11:07 AM | 30 Views
ప్రింట్ కామెంట్
piyush_chawla_ipl_8_delhi_niharonline

ఐపీఎల్-8 లో భాగంగా గురువారం ఢిల్లీ డేర్ డేవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా యూసఫ్ పఠాన్ రాణించటంతో 172 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచింది. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఢిల్లీలో కెప్టెన్ డుమ్ని(25) ఎవరూ రాణించలేదు. యువరాజ్ సింగ్ డకౌట్ తో నిరాశపరిచాడు.  పీయూష్ చావ్లా బౌలింగ్ లో విజృంభించటంతో (4 ఓవర్లు 32 పరులకు 4 వికెట్లు తీయటంతో) కోల్ కతా సొంత మైదానంలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచ్ ల్లో కోల్ కతా 10 విజయాలతో ఊపు మీదుంది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ