బంతి+బ్యాట్+బౌండరీ... గేల్ ‘శత’కొట్టుడు

May 07, 2015 | 11:03 AM | 65 Views
ప్రింట్ కామెంట్
gayle_century_against_punjab_niharonline

బుధవారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది. విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పంజాబ్ కు ఫ్లడ్ లైట్ల వెలుగులో చుక్కలు చూపించాడు. కేవలం 57 బంతుల్లోనే 7 ఫోర్లు, 12 సిక్సర్లతో 117 పిండుకున్నాడు. గేల్ ధాటికి కింగ్స్ ఎలెవన్ బౌలర్లు కకావికలం అయిపోయారు. ఆ దూకుడుకు డివిలియర్స్ (47) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వటంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక ఇన్నింగ్స్  చివరి బంతికి ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆఖరి బంతిని గేల్ సిక్సర్ గా మలిచినప్పటికీ అది డెడ్ బాల్ కావటంతో మరో బంతి వేయాల్సి వచ్చింది. కానీ, గేల్ దానిని సింగల్ గా మలిచాడు. దీంతో గేల్ సిక్స్ కొట్టినప్పటికీ సింగిల్ రన్ తో బెంగళూర్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అనంతరం బ్యాటింగ్ దిగిన పంజాబ్ భారీ లక్ష్యం ముందు చిన్నబోయింది. కనీస స్థాయిలో కూడా పోరాట పటిమను ప్రదర్శించలేదు. అక్షర పటేల్ (40) మినహా జట్టులో ఏ ఒక్కరు స్కోరు బోర్డును పరుగులు పెట్టించలేకపోయారు. దీంతో 13.4 ఓవర్లలో 88 పరుగులకు పంజాబ్ చాపచుట్టేసింది.    

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ