చతికిల పడ్డ చెన్నై... ఫైనల్ కు చేరిన ముంబై

May 20, 2015 | 11:36 AM | 16 Views
ప్రింట్ కామెంట్
mumbai_indians_in_final_ipl_8_niharonline

భారీ లక్ష్యాలను సైతం చేధించగల పటిష్ట జట్టు చెన్నై తొలి ఫ్లే ఆఫ్ లో ముంబై లో జరిగిన మ్యాచ్ లో పరాజయం పాలైంది. మంగళవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. ఓపెనర్లు సిమ్మన్స్, పార్థివ్ పటేల్ ముంబైకి శుభారంభాన్ని ఇవ్వగా, పొలార్డ్ 17 బంతుల్లో 41 పరుగులు చితకబాదటంతో ఆరు వికెట్ల 187 పరుగులు చేసింది. ఇక 188 పరుగలు లక్ష్యాన్ని చెన్నై ఈజీగా చేధించగలదని అంతా భావించారు. అనుకున్నట్టుగానే డూప్లెసిస్ 45, సురేశ్ రైనా రాణించగా అంతా విజయం ఖాయమనుకుంటుండగా, హర్భజన్ రాణించటంతో వరుస బెట్టి వికెట్లు కోల్పోయింది. ఇక ధోనీ 0 పరుగులకే వెనుదిరగగా, చివర్లో అశ్విన్, జడేజాలు పోరాడారు. అయినప్పటికీ 19 ఓవర్లలో 162 పరుగలకు అలౌటయ్యింది. దీంతో రోహిత్ సేన ఫైనల్ కు అర్హత సాధించగా, చెన్నై ఇంటిబాట పట్టింది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ