రైజర్స్ కు షాక్... ప్లే ఆఫ్ కు ముంబై

May 18, 2015 | 10:41 AM | 15 Views
ప్రింట్ కామెంట్
MI_beat_SRH_reaches_playoff_niharonline.jpg

సన్ రైజర్స్ కు పెద్ద షాక్ తగిలింది. ఫ్లే ఆఫ్ పై గంపెడాశలు పెట్టుకున్న హైదరాబాద్ పై ముంబై నీళ్లు చల్లింది. ఆదివారం సొంత మైదానంలో రైజర్స్ కు ముంబై ఇండియన్స్ పెద్ద షాకే ఇచ్చింది. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సన్ రైజర్స్ ఆశలు గల్లంతయ్యాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ దారుణంగా విఫలమయ్యింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 113 పరుగులకు ఆలౌటయ్యింది. వార్నర్, ధావన్ ఇలా టాప్ బ్యాట్స్ మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. చివర్లో బౌలర్లు రాణించటంతో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఆడుతూ పాడుతూ ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. పార్థివ్ పటేల్ (51 నాటౌట్)తోపాటు మరో ఓపెనర్ సిమ్మన్స్ (48) రాణించటంతో ముంబై ఈజీ విక్టరీ సాధించింది. చివర్లో రోహిత్ సిక్స్ తో జట్టుకు జోష్ ఫుల్ విక్టరీ ని అందించాడు. ఇక ఫ్లే ఆఫ్ క్వాలిఫయింగ్ లో భాగంగా ముంబై మంగళవారం చెన్నైతో తలపడనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ