ఐపీఎల్-8 ముంబైదే... 41 పరుగుల తేడాతో చెన్నై చిత్తు

May 25, 2015 | 10:43 AM | 31 Views
ప్రింట్ కామెంట్
MI_IPL_2015_champions_niharonline

మూడోసారి టైటిల్ ఎగరేసుకుపావాలన్న చెన్నై ఆశలను ముంబై గల్లంతు చేసింది. ఆదివారం కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తుది సమరంలో  41 పరుగుల తేడాతో చెన్నై చతికిల పడి ఓడింది. ఆరోసారి ఫైనల్ కు చేరినప్పటికీ ఆ ఆశలను ముంబై ఆవిరి చేసింది. టాస్ గెలిచిన చెన్నై ముందుగా బ్యాటింగ్ కు ముంబైని ఆహ్వానించింది. రెండో ఓవర్లో ప్రారంభమైన ముంబై బాదుడు, 20 వ ఓవర్ వరకు కొనసాగింది. దీంతో 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై సాధించింది. సిమన్స్ 68, కెప్టెన్ రోహిత్ శర్మ 50 పరుగులు సాధించగా, కీరన్ పోలార్డ్ 36, అంబటి రాయుడు 36(నాటౌట్) పరుగులు విరుచుకుపడ్డారు. ఇక భారీ లక్ష్యాలను సైతం చేధించగల చెన్నై ఆరంభం నుంచే తడబడింది. 161 పరుగులు మాత్రమే సాధించి 41 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. విన్నర్ గా నిలిచిన ముంబైకి రూ.15 కోట్లతోపాటు ట్రోఫీ దక్కింది. రన్నరప్ చెన్నైకి 10 కోట్లు లభించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ