రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. విశాఖపట్నంలో గురువారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ పై జయకేతనం ఎగరవేసింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పగించింది. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ ఐదు వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులు మాత్రమే సాధించగలిగింది. రాజస్థాన్ కట్టుదిట్టమైన బౌలింగ్ తో సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఒక్కరు కూడా అర్థ శతకం సాధించలేకపోయారు. ఇక స్వల్ఫ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ ఓపెనర్ అజింక్యా రహానే (62) పోరాటంతో విజయ తీరాలకు చేరిది. అయితే చివర్లో సన్ రైజర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయటంతో విజయం కోసం చివరి బంతి దాకా పోరాడాల్సి వచ్చింది. చివరి బంతిని ఫోర్ గా మలిచి జేమ్స్ ఫాల్కనర్ రాజస్థాన్ కు విక్టరీ అందించాడు. అంతకు ముందు మ్యాచ్ లో విజయంతో కాస్త గాడిలో పడిందనుకున్న సన్ రైజర్స్ మళ్లీ బోల్తా పడింది.