బెంగళూర్ ఛాలెంజర్స్ ‘రాయల్’ విజయం

May 21, 2015 | 11:46 AM | 8 Views
ప్రింట్ కామెంట్
rcb_defeat_rajasthan_in_second_qualifier_niharonline

లీగ్ లో నామమాత్రపు ఆటతీరును కనబరిచిన బెంగళూరు క్వాలిఫయిర్ లో సత్తా చాటింది. బుధవారం రాజస్థాన్ రాయల్స్ తో పుణేలో జరిగిన మ్యాచ్ లో 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఏదశలోనూ విజయానికి దగ్గరగా సాగుతున్నట్లు కనిపించలేదు. ఓపెనర్ అజింక్య రహానే 42 మినహా మిగతావారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. దీంతో కేవలం 19 ఓవర్లలోనే 109 పరుగులకు రాజస్థాన్ అలౌటయ్యింది. ఇక ఫైనల్స్ లో ఛాన్స్ కోసం శుక్రవారం చెన్నైతో ఆమీతుమీకి  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధమౌతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ