ఐపీఎల్-8లో భాగంగా సోమవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో మైదానంలో జరిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 35 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవరల్లో 167 పరుగులు సాధించింది. మనీష్ పాండే (26 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 33), గంభీర్ (23 బంతుల్లో 5 ఫోర్లతో 31), యూసుఫ్ పఠాన్ (19 బంతుల్లో 4 ఫోర్లు 30 నాటౌట్), ఊతప్ప (30) రాణించటంతో మంచి స్కోర్ ను సన్ రైజర్స్ ముందు ఉంచింది. ఇక తర్వాత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ లో ఒక్క హెన్రిక్స్ (33 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 41) మాత్రమే పోరాటం చేశాడు. కర్ణ్‌శర్మ (20 బంతుల్లో 3 సిక్సర్లతో 32) రాణించగా, శిఖర్ ధవన్ (15) ఆదుకోలేకపోయాడు. నమన్ ఓఝా (0), వార్నర్ (4), మోర్గాన్ (5), విహారి (6) పూర్తిగా విఫలమయ్యారు. ఇక కోల్ కతా బౌలర్లలో ఉమేశ్, బ్రాడ్ హాగ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఉమేశ్ యాదవ్ కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’దక్కింది. ఈ గెలుపుతో టోర్నీలో ఐదో విజయం సాధించిన కోల్‌కతా 11 పాయింట్లతో మూడో స్థానంకి చేరింది. ఇక ఐదో పరాజయాన్ని మూటగట్టుకున్న హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.