రాయల్స్ రాజసం... డేర్ డెవిల్స్ చిత్తు

May 04, 2015 | 10:31 AM | 18 Views
ప్రింట్ కామెంట్
rahane_karuna_nair_RR_Delhi_dare_devils_niharonline

ఐపీఎల్ 8 వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ విజయాలతో దూసుకెళ్లుతోంది. ఆరంభం నుంచి అదరగొడుతున్న వాట్సన్ సేన ఆ తర్వాత కొన్ని పరాజయాలు చవిచూసింది. తాజాగా ముంబైలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో గెలుపుతో గాడిన పడింది. 14 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తుచేసింది. ముందుగా టాస్ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా, రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 189 పరుగులు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే (91) మరోసారి వీరబాదుడు బాదగా, అతనికి మరో బ్యాట్స్ మెన్ కరుణా నాయర్ (61) జత కలిసి విధ్వంసం సృష్టించారు. వీరిని నిలువరించటంలో ఢిల్లీ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇక 190 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ 175 పరుగులు మాత్రమే చేసి పరాజయం మూటకట్టుకుంది. కెప్టెన్ డుమ్ని (56) ఒక్కడే రాణించినప్పటికీ మిగతావారెవరు సహాకారం అందించలేకపోయారు. స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ (22) మరోసారి నిరాశపరిచాడు. చివర్లో టీమ్ సౌథీ బౌలింగ్ ప్రతిభ చూపటంతో ఢిల్లీ 175 పరుగులకే తొకముడిచింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ