పంజాబ్ పై 5 పరుగుల తేడాతో రైజర్స్ విజయం

May 12, 2015 | 11:40 AM | 12 Views
ప్రింట్ కామెంట్
Sunrisers_Hyderabad_batsman_david_warner_niharonline

గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో గెలిచి హైదరాబాద్ ఫ్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఓవైపు డేవిడ్ వార్నర్ వీరవిహారం మరోవైపు టెన్షన్ పెట్టిన మిల్లర్ వెరసి 5 పరుగుల స్వల్ఫ తేడాతో రైజర్స్ సోమవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రైజర్స్ డేవిడ్ వార్నర్ (52 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ లతో 81 రన్స్) చెలరేగిపోవటంతో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ తరపున మిల్లర్ దంచికోట్టడంతో విజయం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే చివర్లో జట్టు విజయానికి కావాల్సిన పరుగులు రాబట్టడంలో మిల్లర్ సఫలీకృతుడు కాలేకపోయాడు. దీంతో హైదరబాద్ స్వల్ఫ పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ