కోహ్లీ పరుగుల ‘వాన’ రైజర్స్ కొంపముంచింది

May 16, 2015 | 10:17 AM | 26 Views
ప్రింట్ కామెంట్
RCB_Virat_Kohli_niharonline.jpg

మ్యాచ్ లోని మజా ఏంటో సన్ రైజర్స్, బెంగళూర్ ఛాలెంజర్స్ రుచిచూపాయి. శుక్రవారం రాత్రి ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో బంతి బంతికి మారిన సమీకరణలతో ప్రేక్షకులు మ్యాచ్ ఆద్యంతం ఆస్వాదించారు. ఓ బంతి బెంగళూర్ విజయవకాశాలు పెంచితే, మరో మ్యాచ్ రైజర్స్ గెలుపు అవకాశాలను పెంచింది. అయితే చివరికి డక్ వర్త్ లూయిస్ నిబంధనతోపాటు కెప్టెన్ కోహ్లీ పోరాటంతో బెంగళూరు విజయం సాధించింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించి ప్రారంభించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ధావన్ నిరాశపరిచిన తర్వాత వచ్చిన హెన్రిక్స్ బెంగళూర్ బౌలర్లకు చుక్కలు చూపాడు. దీనికి తోడు మరో ఓపెనర్ వార్నర్ కూడా ధాటిగా ఆడటంతో కేవలం 11 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేశారు. ఇక రైజర్స్ ఇన్నింగ్స్ అనంతరం మరోసారి వర్షం ఆటంకం కలిగించటంతో బెంగళూరు టార్గెట్ ను 6 ఓవర్లకు 81 రన్స్ గా ఫిక్స్ చేశారు. ఇక ఇక్కడి నుంచి విధ్వంసం బెంగళూరు వంతు అయింది. స్టెయిన్ వేసిన తొలి ఓవర్లో 17 పరుగులు చేసిన గేల్, రెండో ఓవర్లో రెచ్చిపోయి 24 పరుగులుచేసి ఆ మరుసటి ఓవర్లో అవుటయ్యాడు. గేల్ ప్రారంభించిన తంతును తర్వాత కోహ్లీ కూడా కంటిన్యూ చేశాడు. చివరి రెండు బంతుల్లో 6 పరుగులు అవసరం కాగా కోహ్లీ భారీ షాట్ కొట్టాడు. దీనిని బౌండరీ లైన్ దగ్గర వార్నర్ ఒడిసి పట్టుకున్న చివరి క్షణంలో బౌండరీ లైన్ తొక్కటంతో బెంగళూర్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.    

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ