అద్భుతంగా ఆడి విజయం అందుకున్న అప్ఘన్

February 26, 2015 | 01:01 PM | 43 Views
ప్రింట్ కామెంట్
afghanistan_won_first_WC_match_against_scotland_niharonline

డునెడిన్ వేదికగా స్కాట్ లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అప్ఘనిస్థాన్ జట్టు అద్భుతంగా ఆడి నెగ్గింది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో ఒక్క వికెట్ తేడాతో గెలిచి బోణి కోట్టింది. లక్ష్య ఛేదనను చేరుకునేందుకు చివరి వరకూ పోరాడి గెలిచి శభాష్ అనిపించుకోవటమే కాదు వరల్డ్ కప్ లో తొలి విజయం నమోదు చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకున్న స్కాట్లాండ్ 50 ఓవర్లలో 210 పరుగులకు చేసి ఆలౌటైంది. స్కాట్లాండ్ ఆటగాళ్లలో కోట్జర్(25), మచాన్(31),మామ్ సెన్(23), బెర్రింగ్టన్(25) . మస్జిద్ ఖాన్(31), ఇవాన్స్(28) పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. ఇక స్వల్ఫ టార్గెట్ అయినప్పటికీ అనుభవలేమి జట్టును వెంటాడింది. ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. కానీ షముల్లాఫ్ షెన్వారీ ఆపద్భాందవుడిగా జట్టును ఆదుకున్నాడు. 147 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 96 పరుగులు చేసి అఫ్ఘన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొమ్మిదో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆఫ్ఘన్ కు చక్కటి విజయాన్ని అందించాడు. అయితే షెన్వారీ సెంచరీ చేరువైన తరుణంలో పెవిలియన్ కు చేరడంతో అఫ్ఘన్ కాసింత అయోమయంలో పడింది. అయితే హమిద్ (15), షాపూర్ జర్దాన్(12) లు చివరి వరకూ క్రీజ్ లో ఉండి విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. దీంతో అఫ్ఘనిస్థాన్ వరల్డ్ కప్ లో తొలి విజయాన్ని కైవసం చేసుకుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ