యూఏఈ బ్యాట్స్ మెన్ సెంచరీ... ఐర్లాండ్ దే విజయం

February 26, 2015 | 10:19 AM | 28 Views
ప్రింట్ కామెంట్
ireland_won_second_match_against_UAE_niharonline

రెండు పసికూనలే... కానీ నువ్వా నేనా అన్న రేంజ్ లో పోరాడాయి. ప్రపంచకప్ గ్రూప్ బీలో భాగంగా యూఏఈ తో జరిగిన మ్యాచ్ లో 279 పరుగుల లక్ష్యాన్ని చేధించి టోర్నీ లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది ఐర్లాండ్. ఐరిష్ స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ ఒబ్రెయిన్ మరోసారి రెచ్చిపోయి కేవలం 25 బందుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 50 పరుగులుచేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒక దశలో రన్ రేట్ 15 చేయాల్సి రావటంతో కెవిన్ జోరు చూపించటంతో రన్ రేట్ అదుపులోకి వచ్చింది. కెవిన్ అవుటయ్యాక విజయ తీరాన్ని విల్సన్, మూనీ, అలెక్స్ కౌసాక్ చేర్చారు. లక్ష్యాన్ని2 వికెట్ల సాయంతో మరో 4 బంతులు మిగిలిఉండగానే ఐర్లాండ్ ఛేదించింది. యూఏఈ బౌలర్లలో జావెద్ 3 వికెట్లు పడగొట్టగా, నవీద్, తాఖిర్ లు చెరో రెండు వికెట్లు నేలకూల్చారు. గురుజీ ఒక వికెట్ పడగొట్టాడు. విల్సన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. తొలుత టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన యూఏఈ ఇన్నింగ్స్ ఆరంభంలో తడబడినప్పటికీ నెమ్మదిగా కుదురుకుంది. షైమన్ అన్వర్ (83 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ తో 106) మెరుపు సెంచరీతో కదంతొక్కడంతో యూఏఈ 279 పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ కు నిర్దేశించింది. ప్రపంచ కప్ చరిత్రలో తొలి సెంచరీ చేసిన యూఏఈ ఆటగాడిగా అన్వర్ రికార్డు సృష్టించాడు. అన్వర్ సెంచరీకి తోడు అంజాద్ అలీ (45), అంజాద్ జావేద్ (42), ఖుర్రం ఖాన్ (36) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లు స్టిర్లింగ్, కెవిన్ ఒబ్రెయెయిన్, సొరెన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ