వార్మప్ మ్యాచ్ లో ఘోరంగా విఫలమైన టీమిండియాపై మాజీ కెప్టెన్ మొహిందర్ అమర్ నాథ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా స్థాయికి తగ్గట్లు ఆడట్లేదని ఆయన మండిపడ్డారు. ఛాంపియన్లుగా వెలుగొందిన కాలంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు ఎలా ఆడాయన్న అంశాన్ని టీమిండియా పరిశీలించాలని సూచించాడు. ప్రతికూల ధోరణి విడనాడాలని, ఛాంప్ అన్న హోదాలో ఆడాలని సలహా ఇచ్చాడు. టీమిండియా టాప్ ఆర్డర్ లో ముఖ్యంగా ధావన్, కోహ్లీ భారీ స్కోర్ సాధించకపోవటమే టీమిండియా కష్టాలకు కారణమని విశ్లేషించాడు. జట్టును చూస్తే ఛాంపియన్ టీం లాగా కనిపించటం లేదని విమర్శించాడు. ఆసీస్ తో వార్మప్ మ్యాచ్ ఓటమి అనంతరం సీనియర్ ప్లేయర్ల విమర్శలు ఎక్కువయ్యాయి. అయితే ఇక్కడో కొసమెరుపు ఏంటంటే... గత వరల్డ్ కప్ సమయంలో భారత్ కి కోచ్ గా పనిచేసిన ధక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ క్రిస్టన్ ఈసారి కూడా ట్రోఫీ భారత్ దే నని చెప్పటం.