ప్రపంచకప్ సమర ప్రారంభ వేడుకలకు మెల్ బోర్న్, క్రిస్ట్ర్ చర్చ్ వేదికలు కానున్నాయి. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఫిబ్రవరి 12 న సాయంత్రం 6గంటల నుంచి 10గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లకు చెందిన కళాకారులచే సాంస్క్రుతిక ప్రదర్శనలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఇక న్యూజిలాండ్ లో జరిగే ప్రారంభ వేడుకలైన మాజీ దిగ్గజాలు రిచర్డ్ హాడ్లీ, స్టీఫెన్ ఫ్లెమింగ్ లతోపాటు కెప్టెన్ మెక్ కల్లమ్ హజరుకానుండగా, మెల్ బోర్న్ లో జరిగే వేడుకలకు ఇప్పటిదాకా ప్రపంచకప్ లో ఆడిన ఆటగాళ్లు పాలుపంచుకోనున్నారు. ఇక సమరం 14 నుంచి ప్రారంభం కానుంది.