అలా చేస్తే ఆటలో మజా ఉండదన్న గేల్

February 06, 2015 | 11:23 AM | 27 Views
ప్రింట్ కామెంట్

ఫార్మట్ ఏదైనా క్రికెట్ లో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేది మాత్రం బ్యాట్స్ మెన్ల వీరబాదుడునే. వారు కొట్టే కొట్టుడుకీ ఈలలు, గోలలు అబ్బో... మైదానం దద్దరిల్లుతుంటే ఆ మజా నే వేరు. అయితే వరల్డ్ కప్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమౌతోంది. అదే బ్యాట్ సైజ్ తగ్గించటం. దీనిపై వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ తీవ్రంగా మండిపడుతున్నాడు. బ్యాట్స్ మెన్లు వాడుతున్న బ్యాట్స్ వారికి అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయని, ఇలాంటి సమయంలో ఈ నిర్ణయం సరికాదని అంటున్నాడు. ప్రస్తుతం వాడే బ్యాట్ లలో స్వీట్ స్పాట్ అంటే బంతి ఎక్కువగా తగిలే మధ్య భాగం ఎక్కువగా ఉండటం వల్ల ఆటగాడు గుడ్డిగా ఊపిన బంతి సిక్సర్ వెళ్తుందని ఐసీసీ భావిస్తోంది. దీంతో బ్యాట్ పొడవు 38 అంగుళాలు, వెడల్పు 4.25 అంగుళాలు ఉండకూడదని నిబంధన విధించింది. దీనిని త్వరలో ప్రారంభం కాబోయే ప్రపంచకప్ లోనే ప్రవేశపెట్టాలని ఐసీసీ భావిస్తోంది. అయితే, క్రికెట్ అంటేనే బ్యాట్స్ మెన్ గేమ్ అయినప్పుడు సైజుపై పరిమితి విధించాలన్నది ఎంతవరకు కరెక్టని గేల్ ఐసీసీ ని ప్రశ్నిస్తున్నాడు. దీని బదులు బౌలర్లు వారి ప్రదర్శనను మెరుగు పరుచుకుంటే పోలా అంటున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ