శభాష్... సొంత గడ్డపై కివీస్ తొలి బోణి

February 14, 2015 | 12:03 PM | 22 Views
ప్రింట్ కామెంట్
newzeland_first_victory_in_WC_niharonline

ప్రపంచకప్ లో తొలివిజయాన్ని న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో శ్రీలంకతో జరిగిన తొలిమ్యాచ్ లో 98 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆండర్సన్ (75), మెక్ కల్లమ్ (65), విలియమ్ సన్ (57) రాణించటంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 331 పరుగులు సాధించింది. అనంతరం భారీ టార్గెట్ తో బరిలో దిగిన శ్రీలంక ఆరంభం బాగానే ఇచ్చినప్పటికీ దానిని కొనసాగించటంలో టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమయ్యారు. దిల్షాన్(24), సంగక్కర(39) కీలక సమాయాల్లో వికెట్లు కోల్పోవటం, మరో కీలక ఆటగాడు జయవర్ధనే డకౌట్ కావటంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఒక్క మాథ్యూస్ (46) మాత్రం న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేసినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో లంక 46.1 ఓవర్లలోనే 233 పరుగులకు అలౌటయ్యింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ