ఆటగాళ్లు కాలు జారితే ఫర్వాలేదు పెయిన్ కిల్లర్ రాస్తే తగ్గిపోతుంది. కానీ, నోరు జారితేనే ప్రమాదం. ఒక్కొసారి మైదానంలో చిన్న చిన్న మాటలే పెద్ద గొడవలకు దారితీయటం మనం తరుచు చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని ఐసీసీ నిర్ణయించింది. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ లో ఆటగాళ్లు నోళ్లు మూత పడేలా ఐసీసీ కొత్త నిబంధనను తెచ్చింది. అదేంటంటే.. అవతలి జట్టు ఆటగాడిపై నోరు పారేసుకుంటే వెంటనే ఓ మ్యాచ్ నిషేధం విధించి పడేస్తారట. ఒకవేళ చేసిన తప్పు మరింత ఎక్కువగా ఉంటే మ్యాచ్ ఫీజుల్లో కోత కూడా ఉంటుందట. కాలు జారితే ఏం కాదు... మాటనే వెనక్కి తీసుకోలేం. అందుకే ఆటగాళ్లు జర జాగ్రత్త సుమీ!