ఐసీసీ అధ్యక్ష పదవికి ముస్తఫా రాజీనామా

April 01, 2015 | 01:22 PM | 217 Views
ప్రింట్ కామెంట్
icc_kamal_resign_niharonline

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్ష పదవికి ముస్తఫా కమల్ రాజీనామా చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన ముస్తఫా ఐసీసీ నిర్ణయాలపై బహిరంగంగానే తన అసంత్రుప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా టీమిండియా-బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అంపైర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగానే తన దేశ జట్టు ఓటమిపాలైందని కమల్ వ్యాఖ్యానించి సంచలనం స్రుష్టించారు. సదరు అంపైరల్ పై కఠిన చర్యలు తీసుకొని పక్షంలో ఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు కూడా వెనుకానబోనని కూడా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ