ప్చ్... కథ కంచికి... ఇండియా ఇంటికి

March 26, 2015 | 05:35 PM | 57 Views
ప్రింట్ కామెంట్
australia_won_india_out_niharonline

కోట్లాది భారతీయుల ఆశలు గలంతయ్యాయి. సప్త సముద్రాలు ఈది పిల్ల కాలువలో దూకి చచ్చినట్లు కాకుండా వరుసగా ఏడు మ్యాచ్ లు గెలిచి సముద్రం లాంటి ఆస్ట్రేలియా చేతిలోనే భారత్ కు గర్వభంగం జరిగింది. దీంతో కప్ కు అందుకోకుండానే భారత్ నిష్క్రమించింది. ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌-ఆస్ర్టేలియా మధ్య గురువారం సిడ్నీలో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్‌ పరాజయం పొందింది.. 95 పరుగుల తేడాతో ఆసీస్‌ గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆస్ర్టేలియా భారత్‌ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసి 329 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ ముందు ఉంచింది. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన టీంఇండియా మొదటి నుంచి తడబడుతూ ఆడింది. 10 ఓవర్లలో కనీసం 50 పరుగులు కూడా చేయలేకపోయింది. ధావన్‌ ఔట్‌ అవగానే వరుసగా టీంఇండియా బ్యాట్‌మెన్స్‌ పెవిలియన్‌ బాట పట్టారు. కెప్టెన్‌ ధోనీ కష్టపడి ఆడి 65 పరుగులు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. 46.5 ఓవర్లలో 233 పరుగులకు ఆల్‌ ఔట్‌ అయ్యారు. ఇది ఆదివారం ఆతిధ్య జట్టుల తుది పోరుకు సిద్ధమైపోవటమే తరువాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ