ఆరు నూరైనా... సెమీస్ లో స్లెడ్జింగ్ చేసి తీరుతాడట

March 25, 2015 | 12:50 PM | 77 Views
ప్రింట్ కామెంట్
mitchell_johnson_sledging_niharonline

ఎదుటి జట్టు ఆటగాళ్ల మీద దూషణలతోపాటు అవసరమైతే ఒక్కోసారి శారీరక దాడికి పాల్పడటం స్లెడ్జింగ్ కిందకి వస్తుంది. ఐసీసీ ఎన్ని కఠినతరమైన నిబంధనలు విధించినా కూడా ఈ పర్వం ఆగట్లేదు. ముఖ్యంగా క్రికెట్ లో స్లెడ్జింగ్ అంటే ముందుగా గుర్తోచ్చేది ఆస్ట్రేలియానే. ప్రపంచంలోని అన్ని జట్లపై స్లెడ్జింగ్ ను విరివిగా వినియోగిస్తున్న జట్టుగా ఆస్ట్రేలియాకు చెడ్డపేరు ఉంది. నిత్యం ప్రత్యర్థులపై మాటల దాడికి దిగే ఆ జట్టు ఆటగాళ్లు అంపైర్లకు తలనొప్పులు తెస్తూనే ఉన్నారు. తాజాగా రేపటి వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లోనూ నోరు మూసుకుని ఆడటం కుదరదని ఆ జట్టు ప్రధాన బౌలర్ మిచెల్ జాన్సన్ చెబుతున్నాడు. స్లెడ్జింగ్ కూడా ఆటలో భాగమేనని చెబుతున్న అతడు, భారత్ తో జరిగే సెమీస్ లో స్లెడ్జింగ్ కు దిగుతానని చెప్పాడు. ‘‘ఈసారి స్లెడ్జింగ్ కు దిగనని మా జట్టు సభ్యుడు వార్నర్ చెప్పినట్లు విన్నాను. ఈసారి ఆ బాధ్యతను నేను తీసుకుంటాను. ఇదంతా ఆటలో భాగమే. పాక్ తో మ్యాచ్ లో వాట్సన్, వహాబ్ ల మధ్య మాటల యుద్ధం నిజంగా అసాధారణం. ఇద్దరు ఏ స్థాయిలో ఆడారో చూశాం కదా అని జాన్సన్ వ్యాఖ్యానించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ