ఖాతా తెరచిన ముంబై ఇండియన్స్

April 20, 2015 | 11:12 AM | 49 Views
ప్రింట్ కామెంట్
unmukt_chand_mi_rcb_ipl_2015_niharonline

ఐపీఎల్-8 సీజన్ లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుస పరాజయాలతో నిరాశపరిచిన ముంబై ఇండియన్స్ జట్టు, ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. 18 పరుగల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ (59) తోపాటు ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ఉన్ముక్త్ చంద్ (58) లిద్దరూ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. సెకండ్ డౌన్ లో క్రీజులోకి వచ్చిన ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(42) కూడా రాణించాడు. ఆ తర్వాత 210 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులే చేయగలిగింది. బెంగళూరు స్టార్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ (10) మరోసారి విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డివిలియర్స్ (41), డేవిడే వైస్(47) పోరాడినా బెంగళూరుకు పరాజయం తప్పలేదు. బంతితో చెలరేగి మూడు కీలక వికెట్లు తీసిన ముంబై బౌలర్ హర్భజన్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ