విరుచుకుపడ్డ స్మిత్, కల్లమ్... ముంబై మరో ఓటమి

April 18, 2015 | 10:50 AM | 69 Views
ప్రింట్ కామెంట్
mccullum_smith_mumbai_indians_niharonline

ప్రత్యర్థి ముందు 184 పరుగుల లక్ష్యం ఉంచింది. అయినా ముంబైకి వరుసగా నాలుగో ఓటమి తప్పలేదు. పోలార్డ్ మెరుపులు, రోహిత్ శర్మ అర్థ సెంచరీ తో రాణించినప్పటికీ చెన్నై దూకుడు ముందు సొంత మైదానంలోనూ తలవంచక తప్పలేదు. ఐపీఎల్ సీజన్ 8 లో భాగంగా  శుక్రవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై మరో పరాజయాన్ని మూటకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 183 స్కోర్ సాధించింది. కెవిన్ పోలార్డ్ (64), రోహిత్ శర్మ(50) వేగంగా ఆడటంతో 184 పరుగుల విజయ లక్ష్యాన్ని చెన్నై ముందుంచింది. ఇక బ్యాటింగ్ కు దిగిన చెన్నై ఆరంభం నుంచే విరుచుకుపడింది. ఓపెనర్లు స్మిత్, మెక్ కల్లమ్ లు ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. బౌలర్ ఎవరనేది చూడకుండా చెలరేగిపోయి బంతిని బౌండరీ దాటించారు. పవర్ ప్లే లోనే 90 పరుగులు రాబట్టారంటే వారి విధ్వంసం ఏపాటిదో అర్థమైపోతుంది. 8 ఓవర్లలో హర్బజన్ వీరిద్దరిని పెవిలియన్ పంపినప్పటికీ అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక తర్వాత వచ్చిన రైనా(46) పని ముగించటంతో చెన్నై మరో 20 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ