ఒక్క విమర్శకు పంచ్ ల మీద పంచులు

March 28, 2015 | 11:48 AM | 90 Views
ప్రింట్ కామెంట్
matthew__hayden_slam_by_newZealand_fans_niharonline

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ న్యూజిలాండ్ క్రికెట్ అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నాడు. కారణం న్యూజిలాండ్ జట్టుపై ఆయన నోరు జారడమే. తాజాగా, హెడెన్ మీడియాతో మాట్లాడుతూ... న్యూజిలాండ్ జట్టుకు ఆస్ట్రేలియాలోని భారీ మైదానాల్లో కష్టాలు తప్పవని ఆయన అన్నారు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే అక్లాండ్ లోని ఈడెన్ పార్క్ ఓ మైదానం కానేకాదు. దాని పరిమాణం హాస్యాస్పదం. మరీ అంత చిన్నా గ్రౌండా?. ఇప్పటిదాకా వారు సొంత మైదానాల్లో ఆడిగెలిచారు. కానీ, మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియం టైటిల్ సమరానికి వేదిక. అతి భారీ స్టేడియం ఇది. దీనిలో వారి పప్పులు ఉడకవు. భారీ షాట్లు కొట్టే ప్రయత్నంలో వారు ఖచ్ఛితంగా క్యాచ్ లు ఇస్తారు అని ఎద్దేవా చేశాడు. ఇక ఈ వ్యాఖ్యలతో కివీస్ ఫ్యాన్స్ కి చిరెత్తుకొచ్చింది. అంతే వారు తమ ఆగ్రహాన్ని సెటైర్ల రూపంలో సోషల్ మీడియా సైట్లలో పోస్టు చేశారు. అవేంటో ఓ లుక్కేద్దాం...

  • ఎంసీజీ(మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్) చాలా పెద్దది... ఆసీస్ మాజీ క్రికెటర్ డేవిడ్ బూన్ ఈ మైదానంలో అటునుంచి ఇటు నడిచి వచ్చే లోపు 52 బీర్లు తాగుతాడు.
  • ఎంసీజీ చాలా పెద్దది... అక్కడ స్ట్రీకర్లకూ (నగ్నంగా మైదానంలోకి పరుగెత్తి నిరసన తెలిపేవారు) డ్రింక్స్ బ్రేక్ ఇస్తారు.
  • ఎంసీజీ చాలా పెద్దది... కెప్టెన్లు ఫీల్డింగ్ మోహరించే క్రమంలో ఆయా పొజిషన్లు వెతుక్కోవాలంటే జీపీఎస్ వ్యవస్థ సాయం తప్పనిసరి.
  • ఎంసీజీ చాలా పెద్దది... అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఇందులో చక్కగా ఇమిడిపోతుంది.
  • ఎంసీజీ చాలా పెద్దది... ఆ కనిపించేవి ఫ్లడ్ లైట్లు కావు... పొరుగు గ్రహ వ్యవస్థ నుంచి తీసుకొచ్చిన భారీ సూర్యుళ్లు.

ఇలా ఎవరు తమకు తోచిన రీతిలో వారు వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. అయితే వీటిపై ఇప్పటిదాకా హెడెన్ స్పందించలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ