స్వల్ఫ లక్ష్యం ముందు సౌతాఫ్రికా బేజారు... పాక్ విజయం

March 07, 2015 | 04:24 PM | 39 Views
ప్రింట్ కామెంట్
pak_victory_over_southafrica_niharonline

వారికది చిన్న టార్గెటే. కావాల్సినన్ని ఓవర్లు ఉన్నాయి. కానీ, బ్యాట్స్ మెన్లు క్యూ కట్టారు. లక్ష్య చేధనలో డివిలియర్స్(77) ఒంటరి పోరుకు సహకారం అందించే వారే కరువయ్యారు. దీంతో పాకిస్థాన్ విధించిన స్పల్ఫ లక్ష్యాన్ని అందుకోవటంలో సఫారీలు చతికిల పడ్డారు. ఫలితంగా ఓటమి రుచిచూశారు. 232 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా జట్టులో ఒక్క డివిలియర్స్ మినహా మరెవరూ రాణించలేకపోయారు. దక్షిణాఫ్రికా జట్టు 33.3 ఓవర్లలో 202 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో పాకిస్థాన్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 29 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్ బిలో 6 పాయింట్లతో నిలిచి క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవం చేసుకుంది. పాక్ లో 49 పరులు చేసి హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచి, ఆరు క్యాచ్ లు పట్టిన సర్ఫరాజ్ అహ్మద్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ