ఐపీఎల్-8 సీజన్ లో రాజస్థాన్ బోణీ కొట్టింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. సెహ్వాగ్, మ్యాక్స్ వెల్, మిల్లర్, బెయిలీ లాంటి పించ్ హిట్టర్లున్నప్పటికీ లక్ష్య ఛేదనలో బొక్క బోర్లా పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 162 పరుగులు చేసింది. జేమ్స్ ఫాల్కరన్(42), స్టీవ్ స్మిత్ (33), దీపక్ హుడా(30) రాణించడంతో రాజస్థాన్ ఏడు వికెట్లను కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్ (0) తో నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ లో తొలి ఓవర్ తొలి బంతికే అతడు అవుటయ్యాడు. బ్యాటింగ్ లో దుమ్మురేపిన జేమ్స్ ఫాల్కనర్ బంతితోనూ రాణించాడు. మొత్తం మూడు వికెట్లు తీసి పంజాబ్ టాపార్డర్ ను కుప్పకూల్చాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పంజాబ్ 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ పై రాజస్థాన్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాట్ తోపాటు బంతితోనూ రాణించిన జేమ్స్ ఫాల్కనర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.