మళ్లీ ఐపీఎల్ పీఠంపై కన్నేసిన శుక్లా?

April 06, 2015 | 01:08 PM | 127 Views
ప్రింట్ కామెంట్
rajeev_shukla_again_eye_on_IPL_niharonline

ఐపీఎల్ చైర్మన్ పదవిని మరోసారి అలంకరించాలని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెలలో ఐపీఎల్ ట్రెజరీ పదవికి పోటీచేసిన ఆయన శ్రీనివాసన్ మద్ధతుదారు అనిరుధ్ చౌదురి చేతిలో దారుణంగా ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఐపీఎల్ అధ్యక్షుడు కావాలనుకుంటున్నారట. ‘ఐపీఎల్ తదుపరి చైర్మన్ శుక్లానే’ అని బీసీసీఐ ఆఫీస్ బేరర్ ఒకరు ఆంగ్ల మీడియాతో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ కొత్త చైర్మన్ గా జగన్మోహన్ దాల్మియా పునరాగమనం నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ ఛైర్మన్ గా రంజిబ్ బిశ్వాల్ ఉన్నారు. ఆయననే కొనసాగించాలని శ్రీనివాసన్ వర్గం భావిస్తోంది. ఇక శరద్ పవార్ వర్గం అజయ్ షిర్కేను బలపరుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ