యువీ మెరుపులు... పంజాబ్ పరాజయం

April 16, 2015 | 10:25 AM | 72 Views
ప్రింట్ కామెంట్
Yuvraj_Singh_delhi_dare_devils_niharonline

గత సీజన్ తో కలిపి వరుసగా 11 మ్యాచ్ ల్లో పరాజయం పాలైన ఢిల్లీ జట్టు ఎట్టేకేలకు విజయంతోపాటు ఈ సీజన్లో బోణీ కొట్టింది. దీంతో వీరేంద్రుడిపై యువీదే పైచేయిగా నిలిచింది. ఐపీఎల్-8లో భాగంగా బుధవారం పంజాబ్ లెవన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించింది.  ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ సెహ్వగ్ 47 తో రాణించటంతో 165 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ముందుంచింది. ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ 5 వికెట్లు కోల్పోయి చివరి బంతి మిగిలుండగా విజయతీరాలకు చేరింది. యువరాజ్ సింగ్ (55), మెరుపు ఇన్నింగ్స్ తోపాటు మరోఓపెనర్  మయాంక్ అగర్వాల్ (68) హాఫ్ సెంచరీలతో చెలరేగటంతో సులువుగా విజయం అందుకుంది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ