సౌతాఫ్రికా గ్రూప్ దండయాత్ర పూర్తి... నెక్స్ట్

March 12, 2015 | 05:54 PM | 37 Views
ప్రింట్ కామెంట్
SOUTHAFRICA_victory_over_UAE_niharonline

వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా హవా కొనసాగుతోంది. గ్రూప్ దశలో భాగంగా చివరి మ్యాచ్ యూఏఈ తో తలపడిన సఫారీలు విజయంతో లాంఛనాన్ని పూర్తిచేశారు. ఫలితంగా 146 పరుగుల తేడాతో యూఏఈ చిత్తైంది. టాస్ ఓడినప్పటికీ తొలుత బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 341 పరుగుల  స్కోర్ చేసింది. కెప్టెన్ డివిలీయర్స్ త్రుటిలో(99) సెంచరీని చేజార్చుకున్నాడు. ఇక లోయరార్డర్ లో బెహార్డియన్ రాణించగా, మిల్లర్, రూసో వారికి తోడు కలియడంతో ఈ స్కోర్ సాధించగలిగింది. యూఏఈ బౌలర్లలో నవీద్ 3 వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలో దిగిన యూఏఈ జట్టు 47.3 ఓవర్లలో కేవలం 195 పరుగులు మాత్రమే చేసి ప్యాకప్ చేప్పేసింది. యూఏఈ ప్లేయర్లలో స్వప్నిల్ పాటిల్ ఒక్కడే 57 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఫిలాండర్, మోర్కెల్ తోపాటు బ్యాటింగ్ ఝుళిపించిన డివిలియర్స్ కూడా రెండేసి వికెట్లు పడగొట్టారు. కాగా, మొత్తం ఆరు గ్రూప్ మ్యాచ్ లలో నాలుగింట్లో విజయం సాధించింది క్వార్టర్ ఫైనల్ కి చేరటమే గాక, జాబితాలో రెండోస్థానంలో నిలిచింది.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ