వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా రెండో సెమీస్ గురువారం భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మంచి శుభారంభాన్ని ఇచ్చింది. 12 పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. బ్యాటింగ్ అనుకూలించే పిచ్ కావటంతో దాదాపు 300 పైగానే పరుగులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక 12 ఓవర్ ను విరాట్ కోహ్లీతో వేయించి కెప్టెన్ ధోనీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆసీస్ స్కోర్ 19 ఓవర్లకు 100 పరుగులు సాధించింది. 53 బంతుల్లో స్టీవెన్ స్మిత్ అర్థసెంచరీ సాధించగా, అరోన్ ఫించ్ 54 బంతుల్లో 34 పరుగులతో నెమ్మదిగా ఆడుతున్నాడు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ అభిమాలు సిడ్నీ స్టేడియంలో భారత్ కు మద్ధతుగా నిలవటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం 23 ఓవర్లకు 121/1 స్కోర్ ఉంది. స్మిత్ 58, ఫించ్ 45 పరుగులతో కొనసాగుతున్నారు.