సెమీస్ కోసం సిడ్నీలో చెమటోడ్చుతున్న బ్లూమెన్

March 23, 2015 | 03:22 PM | 60 Views
ప్రింట్ కామెంట్
India_practise_at_sydney_WC_niharonline

ప్రపంచకప్ సమరంలో భాగంగా ఈ నెల 26న ఆస్ట్రేలియా తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టు తీవ్రంగా సాధన చేస్తోంది. శనివారమే సిడ్నీ చేరుకున్న ధోనీసేన ఆదివారం జిమ్ లో గడిపింది. ఆటగాళ్లు ఫిట్ నెస్ కోసం పలు రకాల కసరత్తులు చేశారు. ఇక, సోమవారం సిడ్నీ మైదానంలో నెట్ ప్రాక్టీస్ చేశారు. ఉదయం పుట్ బాల్ ఆడారు. అనంతరం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, శిఖర్ ధావన్ నెట్స్ లో చెమటలు కక్కేలా ప్రాక్టీస్ చేశారు. రోహిత్... స్పిన్నర్లు అశ్విన్, జడేజాలతో బంతులు వేయించుకుని సాధన చేయగా, కోహ్లీ, ధావన్ పేస్ ను ఎదుర్కొనేందుకు మొగ్గుచూపారు. అందరిలోకి కోహ్లీ ఎక్కువ సేపు నెట్ లో గడిపాడు. కోహ్లీ... పాక్ తో మ్యాచ్ మినహా భారీ స్కోర్లు సాధించకపోవటంతో విమర్శలు వస్తున్నాయి. విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు ఆసీస్ తో మ్యాచ్ లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఈ యువకెరటం ద్రుఢ నిశ్చయంతో ఉన్నాడు. కాగా, సిడ్నీ పిచ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. దీంతో, అశ్విన్-జడేజా జోడీ కీలకం కానుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ