ధోనీ సేన సమ్ థింగ్ స్పెషల్ అంటున్న సచిన్

February 11, 2015 | 01:23 PM | 37 Views
ప్రింట్ కామెంట్
Tendulkar_confident_on_team_for_WC_niharonline

ప్రపంచకప్ లో భారత జట్టు మీద తనకు పూర్తి నమ్మకం ఉందని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న ధోనీ సేన అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తుందని, దేశ ప్రజల ముఖాలపై చిరునవ్వులు పూయించేందుకు సంథింగ్ స్పెషల్ రీతిలో రాణిస్తుందని పేర్కొన్నాడు. చెన్నై లోని తాంబరం వద్ద సాయిరాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇండోర్ స్టేడియం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అభిమానుల మద్ధతు, ప్రార్థనలతో టీమిండియా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ