జింబాబ్వేపై యూఏఈ భారీ స్కోర్

February 19, 2015 | 09:46 AM | 27 Views
ప్రింట్ కామెంట్
UAE_ZIMBAMBE_NIHARONLINE

ప్రపంచకప్ సమరంలో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో యూఏఈ భారీ స్కోర్ సాధించింది. యమాన్ అన్వర్ అర్థ సెంచరీకి తోడు ఖుర్రమ్ ఖాన్ రాణించడంతో భారీ స్కోరు నమోదుచేసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. జింబాబ్వే ముందు 286 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. షయమాన్ అన్వర్ 50 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ తో 67 పరుగులుచేశాడు. ఖుర్రమ్ ఖాన్ 45, కృష్ణ చంద్రన్ 34, పాటిల్ 32, బెరెన్జర్ 22, అమ్జదాద్ అలీ 7, ముస్తఫా 4 పరుగులు చేసి అవు టయ్యారు. చివర్లో జావేద్(25), నవీద్(23) వేగంగా ఆడడంతో యూఏఈ భారీ స్కోరు సాధించింది. వీరిద్దరూ 8వ వికెట్ కు 32 బంతుల్లో 50 పరుగులు జోడించారు. జింబాబ్వే బౌలర్లలో ఛతారా 3 వికెట్లు పడగొట్టాడు. మిరె, విలియమ్స్ రెండేసి వికెట్లు తీశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ