అట్టహాసంగా ప్రారంభమైన ఆరంభ వేడుకలు

February 12, 2015 | 03:22 PM | 24 Views
ప్రింట్ కామెంట్

ప్రపంచకప్ ఆరంభ వేడుకలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచకప్‌లో మ్యాచ్‌ల ప్రారంభానికి రెండు రోజుల ముందే జరప తలపెట్టిన ఆరంభ వేడుకలు ఆతిథ్య దేశాలు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలో వేరువేరుగా జరుగుతున్నాయి. న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ క్రైస్ట్ చర్చ్ హాగ్లే పార్క్ ఓవలె లో ప్రారంభించి పాల్గొనే అన్ని దేశాలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక్కడి వేడుకల్లో ఐరిష్ సింగర్లు, బ్రిటిష్ బెల్లీ డాన్సర్లు, ఆప్ఘన్ కళాకారులు సాంస్ర్కుతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఇక ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లోనూ వరల్డ్ కప్ ప్రారంబోత్సవ వేడుకలు ఆరంభమయ్యాయి. ప్రఖ్యాత గాయకులు తమ గాన మాధుర్యంతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించారు. ఇక్కడ జరిగిన వేడుకల్లో మాజీ క్రీడాకారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ