రాజస్థాన్ హ్యాట్రిక్ గెలుపు... ముంబై మూడో ఓటమి

April 15, 2015 | 10:06 AM | 42 Views
ప్రింట్ కామెంట్
Steven_Smith_Rajasthan_Royals_captain_niharonline

రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ కొట్టింది. ఐపీఎల్-8 సీజన్‑లో రాజస్థాన్ వరుసగా మూడో విజయం సాధించగా, ముంబై ఇండియన్స్ మూడో పరాజయం చవిచూసింది. మంగళవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయినప్పటికీ పోలార్డ్ (70), కోరీ ఆండర్సన్(50) రాణించటంతో ఆ మాత్రం స్కోర్ సాధించగలిగింది. ఇక  165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్లు కోల్పోయి మరో 5 బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ అజింక్య రహానే (46) శుభారంభాన్ని ఇవ్వగా, కెప్టెన్ స్మిత్ (79) విశ్వరూపం ప్రదర్శించటంతో ముంబై తోక ముడవక తప్పలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ