ఆ భారీ స్కోరే కదా... మా గేల్ కొట్టేస్తాడు అని గంపెడు ఆశలు పెట్టుకున్ వెస్టిండీస్ అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ డివిలియర్స్ జూలు విదిల్చటంతో 409 పరుగుల భారీ లక్ష్యం విండీస్ ముందు ఉంచగా, తర్వాత బరిలో దిగిన కరేబియన్ జట్టులో వరుసగా క్యూ కట్టారు. దీంతో కేవలం 33.1 ఓవర్లలో 151 స్వల్ఫ స్కోర్ సాధించింది. ఆశలు పెట్టుకున్న గేల్ కేవలం 3 పరుగులు సాధించగా, స్మిత్ ఒక్కడే 31 పరుగులతో రాణించాడు. ఫలితంగా 257 పరుగుల భారీ తేడాతో సఫారీలు జయకేతనం ఎగురవేశారు. దీంతో భారత్ పై ఓడిపోయి నిరాశ మీదున్న దక్షిణాఫ్రికా జట్టు ఈ మ్యాచ్ తో చిరస్మనీయ విజయం సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు డివిలియర్స్ బీభత్సానికి 409 భారీ పరుగులు సాధించింది. కేవలం 66 బంతుల్లోనే 17 ఫోర్లు, 8 సిక్సర్లతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడి 162 పరుగులు సాధించాడు. బౌలర్ ఎవరని చూడకుండా బాది విడిచిపెట్టాడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. మొత్తం మీద వరల్డ్ కప్ లో రెండో హయ్యెస్ట్ స్కోర్ సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు స్రుష్టించింది. ఇప్పటిదాకా హయ్యెస్ట్ స్కోర్ 2007లో బెర్ముడా పై భారత్(413) సాధించిందే ఉంది.