మెల్ బోర్న్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 333 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా 47 ఓవర్లలో కేవలం 240 పరుగులకే కుప్పకూలింది. టీంలో రెహమాన్ (53) ఒక్కడే రాణించాడు. షకిబ్ అల్ హసన్ 46, ముష్ఫికర్ రహీం 36 పరుగులు సాధించారు. ఇక భారీ భాగస్వామ్యం నమోదు కాకపోవటంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. లంక బౌలర్లలో మలింగకు 3, లక్మల్ కు 2, దిల్షాన్ కు 2 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన లంక దిల్షాన్, సంగక్కరలు జూలు విదిల్చటంతో 332 పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లా ముందు ఉంచగలిగింది. ఓపెనర్ 161 పరుగులతో విజ్రుంభించగా, కెరీర్ లో 400వ వన్డే ఆడిన సంగక్కర 105 పరుగులు సాధించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దిల్షాన్ కు అందజేశారు.